: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కాశీ విశ్వనాథ్ రైలు.. ఈ నెలలో నాలుగోది!
రైలు ప్రమాదాలు ఆగడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వారణాసి నుంచి న్యూఢిల్లీ వచ్చిన రైలు యార్డుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాషింగ్ లైన్‌లో డీజిల్ ఇంజిన్ పట్టాలు తప్పిందని, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి నీరజ్ శర్మ తెలిపారు. కాగా, తాజా రైలు ప్రమాదం ఈ నెలలో నాలుగోది కావడం గమనార్హం. ఈ నెల 7న కేవలం 9 గంటల వ్యవధిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీలలో మూడు రైళ్లు పట్టాలు తప్పాయి.