: చెన్నైలో మహేశ్ బాబు అభిమానుల సందడే సందడి!
మహేశ్ బాబు, ఎ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న సినిమా ‘స్పైడర్’ ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా చెన్నైలో మహేశ్ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. చెన్నైలోని కలైవానర్ ఆరంగం ప్రాంగణానికి ఇప్పటికే మహేశ్, రకుల్ ప్రీత్ సింగ్, మురుగదాస్ చేరుకున్నారు. కాసేపట్లో ఈ సినిమా తమిళ వర్షన్ పాటలతో పాటు తెలుగు పాటలను కూడా అక్కడే విడుదల చేస్తారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మహేశ్ బాబు అభిమానులు తరలివెళ్లారు. ఆ ప్రాంగణంలో మహేశ్ బాబు భారీ కటౌట్లు కనపడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు అభిమానులను అలరిస్తున్నాయి.