: కీలక నిర్ణయాలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సుదీర్ఘంగా జరుగుతోన్న ఈ సమావేశంలో మంత్రివర్గం 60కి పైగా అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని రైతులకు మూడవ దశ రుణమాఫీ నిధుల విడుదల, నిరుద్యోగ భృతి, జలసిరి కార్యక్రమంపై మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని చక్కెర, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను ఆదుకునేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రూల్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, పెసలు కొనుగోళ్లపై కూడా చర్చించింది. నీటి పారుదల శాఖకు రుణం ఇచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంది. బోగస్ వ్యవసాయ కళాశాలలపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.