: ఉల్లి ధర భారీగా పడిపోయింది.. చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి ఆదినారాయణ రెడ్డి
ఉల్లి ధర భారీగా పడిపోయిందని, అందుకు కారణం కొత్త పంట మార్కెట్లోకి రావడమేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆది నారాయణ రెడ్డి తెలిపారు. ఉల్లి ధర పడిపోతోన్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ఉల్లి కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. టన్ను ఉల్లిని రూ.6 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వారం క్రితం వరకు ఉల్లి ధర బాగానే ఉందని, ఇప్పుడు మాత్రం టన్ను ఉల్లి ధర రూ.4 వేలకు పడిపోయిందని చెప్పారు. ఉల్లి ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.