: చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత అధికం: హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ జ్యోతిక వ్యాఖ్యలు
చాలా కాలం తరువాత సినీ రంగంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన నటి జ్యోతిక చేతిలో ప్రస్తుతం 'మగళీర్ మట్టుం' అనే కథానాయిక ప్రధాన కథా చిత్రం ఉంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జ్యోతిక చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని ఆమె పేర్కొంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎంత మంచి కథతో రూపొందినప్పటికి వారం తర్వాతే వసూళ్లు రావడం మొదలవుతాయని, అదే హీరోల సినిమాలు ఎంత చెత్తగా ఉన్నప్పటికీ మొదటి రోజుల్లో భాగానే ఆడతాయని వ్యాఖ్యానించింది. మహిళలకి సినీ పరిశ్రమలో ప్రాముఖ్యత చాలా తక్కువని చెప్పింది. ఈ పరిస్థితులు మారాలని పేర్కొంది. సుధా కొంగర లాంటి దర్శకురాలికి నటుడు మాధవన్ అవకాశం ఇవ్వకపోతే 'ఇరుదుసుట్రు' వంటి భారీ హిట్ సినిమా వచ్చేదా? అని ఆమె ప్రశ్నించింది.