: `బోగన్` తెలుగు రీమేక్‌లో ప్రతినాయక పాత్రలో ఎస్‌జే సూర్య?
తమిళంలో వచ్చిన `బోగన్` సినిమా తెలుగు రీమేక్‌లో ప్రతినాయక పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ పాత్రను అరవింద స్వామి పోషించారు. తెలుగులో ఆయననే విలన్‌గా పెట్టాలని చిత్ర నిర్మాతలు అనుకున్నారు. కానీ `ధృవ` తర్వాత తెలుగు రీమేకుల్లో నటించబోనని అరవింద స్వామి స్పష్టం చేయడంతో ప్రతినాయక పాత్ర నటుడి కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఈ పాత్రకి ఎస్‌జే సూర్య అయితే ఈ పాత్రకి న్యాయం చేయగలడని ఆయనను సంప్రదించారు. ఈ ఆఫర్‌కి సూర్య అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన `స్పైడర్` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. `బోగన్` తెలుగు రీమేక్‌లో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన కేథరీన్ త్రెసా నటిస్తోంది. తమిళంలో దర్శకత్వం వహించిన లక్ష్మణ్, తెలుగులో కూడా దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు.