: ఫేస్‌బుక్ లో అత్యధిక మంది అనుసరిస్తున్న భారత సెలబ్రిటీల జాబితా.. కాజల్ కూ స్థానం!
ఫేస్‌బుక్‌లో అత్యధిక మంది ఫాలో అవుతోన్న ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న టాప్-15 సెలబ్రిటీల్లో దక్షిణాది నుంచి ఒక్క కాజల్ అగర్వాల్ మాత్రమే ఉంది. తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం కోహ్లీ ఫేస్‌బుక్ పేజీని అత్యధికంగా 35.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారని తెలిసింది. ఇక కోహ్లీ తరువాతి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఈ బాలీవుడ్ హీరోని 35.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 34 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో దీపికా పదుకొణె ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ప్రియాంక చోప్రా (32.3 మిలియన్లు), హనీసింగ్ (30.4 మిలియన్లు) నిలిచారు.
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 28.5 మిలియన్ల ఫాలోవర్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఏడో స్థానంలో శ్రేయా ఘోషల్ (28.3 మిలియన్లు), ఎనిమిదో స్థానంలో అమితాబ్ బచ్చన్ (27.2 మిలియన్లు), తొమ్మిదో స్థానంలో మాధురీ దీక్షిత్ (26 మిలియన్లు), పదవ స్థానంలో కపిల్‌శర్మ (26 మిలియన్లు) ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా సోనాక్షి సిన్హా (23.7 మిలియన్లు), అక్షయ్ కుమార్ (23.7 మిలియన్లు), షారుక్ ఖాన్ (23.6 మిలియన్లు), ఎ.ఆర్. రెహమాన్ (22.8 మిలియన్లు), కాజల్ అగర్వాల్ (23.2 మిలియన్లు) ఉన్నారు.