: ముద్రగడ కూడా జగన్ తో పాటు ప్రచారానికి వస్తే బాగుండేది: చంద్రబాబు
కాకినాడ కార్పొరేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ప్రచారానికి వచ్చుంటే... ఫలితం మరోలా ఉండేదని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశానికి చెందిన ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ తో పాటు ముద్రగడ కూడా ప్రచారానికి వస్తే చాలా బాగుండేదంటూ కామెంట్ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో కాకినాడ నేతలు రిలాక్స్ అయ్యారని... అయితే, తాను వారిని హెచ్చరించి, పరుగులు పెట్టించానని అన్నారు.