: గతేడాది చేసిన గిన్నిస్ బుక్ రికార్డును తిరగరాస్తాం: ఎంపీ కవిత


తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బ‌తుక‌మ్మ వేడుక‌ను ఈ సారి మ‌రింత ఘ‌నంగా జ‌రుపుకుంటామ‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. గ‌త ఏడాది ఎల్బీ స్టేడియంలో అత్య‌ధిక‌మంది మ‌హిళ‌లు ఒకేసారి బ‌తుక‌మ్మ ఆడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 26న ఎల్బీ స్టేడియంలో 40 వేల మంది మ‌హిళ‌ల‌తో మెగా బ‌తుక‌మ్మ ఉంటుంద‌ని, గతేడాది సాధించిన రికార్డును తిరగరాస్తామని క‌విత అన్నారు.  

  • Loading...

More Telugu News