: త్వరలోనే పార్టీ తరఫున సొంత టీవీ ఛానల్, పత్రిక: ఉత్తమ్ కుమార్ రెడ్డి
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కోసం సొంత టీవీ ఛానల్, పత్రిక ఏర్పాటు కానున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ వేధింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని తెలిపారు. కేసీఆర్ పరిపాలనలో కేవలం నలుగురికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.
కేసీఆర్ చెప్పిన మాయ మాటల వల్లే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 2019 ఎన్నికలో తాము 90 స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని... కేసీఆర్ పాలనలో రైతులు నానా అవస్థలకు గురవుతున్నారని... విద్యుత్ పై ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని మండిడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలవుతుందని... ఆ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.