: జానారెడ్డిలాంటి నేతలు కూడా అబద్ధాలు మాట్లాడటం సరికాదు: లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిలాంటి వారు కూడా అబద్ధాలు మాట్లాడటం సరికాదని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నేరెళ్ల బాధితులకు చికిత్స అందించకుండా, నిమ్స్ ఆసుపత్రి నుంచి బయటకు పంపించారని జానారెడ్డి ఆరోపించడం సరైంది కాదని... ఆయన అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బాధితులకు పరీక్షలు నిర్వహించిన తర్వాత... ఇన్ పేషెంట్ గా చేర్చుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారని... దీనికి బాధితులు కూడా అంగీకరించి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. అవసరమైతే వారిని మీడియా సమక్షంలో ఆసుపత్రిలో చేర్చడానికి కూడా సిద్ధమని చెప్పారు. నేరెళ్ల బాధితులను అడ్డం పెట్టుకుని, రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.