: బాబు నారు పోశారు.. వైఎస్ నీరు పోశారు!


కాంట్రాక్టు కార్మికుల వ్యవస్థను ఏర్పాటు చేసింది చంద్రబాబేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కాంట్రాక్టు విధానాన్ని బాబు మొదలు పెట్టగా.. దాన్ని రద్దు చేస్తానని చెప్పి గద్దెనెక్కిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంకా పెంచి పోషించాడని హరీశ్ రావు విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాకారం కాగానే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

హరీశ్ రావు నేడు మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు కార్మికుల మూడో వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, సీఎంతో మంత్రులకు పొసగకపోవడంతో రాష్ట్రంలో పాలన స్థంభించిందని తెలిపారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని హరీశ్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News