: ‘తీపి గుర్తు’.. పదేళ్ల వయసులో తండ్రితో సినీ హీరో మంచు విష్ణును చూడండి!


సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే తెలుగు సినీ న‌టుల్లో మంచు విష్ణు ఒక‌రు. త‌న సినిమాల‌తో పాటు త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేస్తుంటాడు మంచు వార‌బ్బాయి. తాజాగా, త‌న‌కు సుమారు ప‌దేళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో త‌న నాన్నతో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసి త‌న తీపి గుర్తుల్లో ఇదొక‌ట‌ని అన్నాడు. త‌న తండ్రి మోహ‌న్ బాబు 'అల్లుడు గారు' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న‌ప్పుడు ఆయ‌న ప‌క్క‌న కూర్చున్నాన‌ని, త‌న తండ్రి ఓ పాట సాహిత్యాన్ని త‌న‌కు వివ‌రించి చెబుతున్నార‌ని విష్ణు పేర్కొన్నాడు. త‌న నాన్నే త‌న హీరో అని అన్నాడు.

  • Loading...

More Telugu News