: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ పై భారత్ ఆగ్రహం
ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంలా మారిందని తెలుపుతూ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఆ దేశ తీరుని మరోసారి ఎండగట్టింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... పాకిస్థాన్ తమ విధానాల్లో ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. కశ్మీర్ భారత్‌లోని అంతర్భాగమని తెలుపుతూ, శాంతి అనేది పొరుగుదేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర గౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను ఉపయోగించుకుంటోందని చెప్పారు. భారత్ గాంధీ సిద్ధాంతాలైన అహింస, శాంతిని మాత్రమే ప్రోత్సహిస్తుందని అన్నారు.