: చైనాలో కాన్పు కోసం వచ్చి ఆసుపత్రి 5వ అంతస్తు నుంచి దూకేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ!
పురిటి నొప్పులను భరించలేక ఓ మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్న ఘటన చైనాలో చోటు చేసుకుంది. సిజేరియన్ చేయడానికి చైనాలో ఆంక్షలు కఠినంగా వుంటాయి. అక్కడ ఎవరికైనా సిజేరియన్ చేయాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. అయితే, శిశువు తల కాస్త పెద్దగా ఉండటంతో చైనాలోని ఓ ఆసుపత్రిలో సదరు మహిళకు నార్మల్ డెలివరీ కష్టంగా మారింది. తాను సిజేరియన్ చేయించుకుంటానని తన కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో ఆమె బతిమిలాడుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ, వారు కాస్త ఓర్చుకో అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో ఆ గర్భిణి ఈ ఘటనకు పాల్పడింది.