: హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానాన్ని ఢీ కొన్న పక్షి


హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీ కొన‌డంతో ఆ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా దించేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై సంబంధిత అధికారులు మాట్లాడుతూ... ఆ విమానం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ నుంచి బ‌య‌లుదేరింద‌ని చెప్పారు. టేకాఫ్‌ అయిన వెంటనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అన్నారు. ఈ విషయాన్ని పైల‌ట్ వెంట‌నే గమనించి అధికారులకు సమాచారం అందించాడని, దీంతో వెంటనే విమానాన్ని తిరిగి రాయ్‌పూర్‌లోనే దింపేసిన‌ట్లు వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.     

  • Loading...

More Telugu News