: అక్షయ్ కుమార్ 50వ పుట్టినరోజు సందర్భంగా ట్వింకిల్ ఖన్నా పోస్ట్ చేసిన వీడియో చూడండి!
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇప్పటికీ వరుస హిట్లతో అదరగొడుతున్న అక్షయ్ కుమార్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇంట్లో కింద కూర్చుని.. అడుగుతున్న దానికి సమాధానంగా.. ఒక్కో భావాన్ని అక్షయ్ అల్లరిగా పలికిస్తుండటాన్ని చూడొచ్చు. `నా మంచి స్నేహితుడు, ప్రపంచంలోనే అత్యంత దయగల వ్యక్తి, గొప్ప తండ్రి, ఉత్తమ డ్యాన్సర్, అన్నింటికంటే ముఖ్యంగా అతని హాట్‌నెస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు` అని ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.