: నిక్కీ హేలీని వేశ్యగా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తర కొరియా


ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీపై ఉత్తర కొరియా దారుణ వ్యాఖ్యలు చేసింది. స్కర్టులను ధరించే ఆమె ఒక వేశ్య అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. నడుస్తున్నప్పుడు నిక్కీ తన స్కర్ట్ తో వింత శబ్దాలు చేస్తారని ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. వేశ్యలాంటి ఆమెకు ట్రంప్ కీలక బాధ్యతలను అప్పగించారంటూ ఎద్దేవా చేసింది. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించడానికి నిక్కీ హేలీ ఒత్తిడే కారణమని... ఆమె వ్యవహారశైలి కూడా బాగోలేదని మండిపడింది. ఉత్తర కొరియా గురించి మాట్లాడేటప్పుడు నిక్కీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News