: పెళ్లి రోజున భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేసిన మయంతి లాంగర్!
క్రికెట్ అభిమానులకు మయంతి లాంగర్, స్టువర్ట్ బిన్నీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా స్టువర్ట్, ప్రజెంటర్‌గా మయంతి అందరికీ సుపరిచితమే. వీళ్లిద్దరూ భార్యభర్తలన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బెల్గావి పాంథర్స్ జట్టులో స్టువర్ట్ ఆడుతున్నాడు.
శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ 46 బంతుల్లో 87 పరుగులు తీశాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇదే మ్యాచ్‌కు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న మయంతి, స్టువర్ట్‌ను ఇంటర్వ్యూ చేసింది. మరో ప్రత్యేకత ఏంటంటే... శుక్రవారం వారి పెళ్లిరోజు కూడా... 2012లో వారు ఇద్దరు ఒక్కటైన రోజునే మయంతికి భర్తను ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం, ఆటలో స్టువర్ట్ మంచి ఆటతీరు కనబరచడం వారి అదృష్టమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాలను గుర్తుచేస్తున్నారు.