: ఫొటోగ్రాఫర్లపై బౌన్సర్ల దాడి అమానుషం అంటూ స్పందించిన శిల్పాశెట్టి
ముంబైలోని బాంద్రా వద్ద ఉన్న బాస్టియన్ రెస్టారెంట్‌కి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాతో కలిసి వచ్చారు. వారు భోజనం పూర్తి చేసుకుని వెళ్లిపోతుండగా ఇద్దరు ఫొటోగ్రాఫర్లు అడగటంతో ఫొటోలకు పోజులిచ్చారు. వాళ్లు వెళ్లిన తర్వాత రెస్టారెంట్‌కి చెందిన బౌన్సర్లు ఆ ఇద్దరు ఫొటోగ్రాఫర్లపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తీవ్రగాయాల పాలైన ఫొటోగ్రాఫర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బౌన్సర్లను అరెస్టు చేశారు.
దీనిపై శిల్పాశెట్టి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. `బౌన్సర్ల దాడిని నేను ఖండిస్తున్నాను. నిజానికి నేనే స్వయంగా ఫొటోలకు పోజులిచ్చాను. నా ఎదుగుదలలో ఫొటోగ్రాఫర్లు కూడా ఓ భాగమే. వృత్తిని సక్రమంగా నిర్వహించిన వారిపై రెస్టారెంట్ బౌన్సర్లు ఇలా దాడి చేయడం అమానుషం` అని ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. బాస్టియన్ రెస్టారెంట్ సిబ్బంది కూడా ఈ విషయంపై స్పందించారు. `అవుట్‌సోర్సింగ్ ద్వారా ఓ సెక్యూరిటీ ఏజెన్సీ ఆ బౌన్సర్లను నియమించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటాం. వెంటనే సెక్యూరిటీ ఏజెన్సీతో కాంట్రాక్టును రద్దుచేసుకుంటాం` అని రెస్టారెంట్ యాజమాన్యం బృందం ప్రకటించింది.