: నీట్ ఆందోళనలను కట్టడి చేయండి... తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
నీట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో తమిళనాడుకు చెందిన విద్యార్థిని అనిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో నీట్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తాయి. అయితే ఆ ఆందోళనలు కట్టడి చేయాలని, ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఆదేశించింది. ఆందోళనలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.