: హనీ ప్రీత్ ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్న ఐబీ
డేరా బాబా దత్త పుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు భావిస్తున్నారు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమెను చంపేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో, హర్యాణా ప్రభుత్వం అలర్ట్ అయింది. హనీ ప్రీత్ కోసం గాలింపును ముమ్మరం చేశామని పోలీస్ అధికారి సంధూ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి, రహస్య విచారణ జరుపుతున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గత నెల 25న జైల్లో ఉన్న గుర్మీత్ ను కలిసేందుకు ఆమె వచ్చింది. అయితే జైలు అధికారులు ఆమెను అనుమతించక పోవడంతో... డేరా బాబా అనుచరులు ఆమెను వాహనంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు.