: 'కాళ్ల'తో గిన్నిస్ రికార్డును తన్నుకుపోయిన ముద్దుగుమ్మ!
కొందరు సాహసాలు, విన్యాసాలు చేసి గిన్నిస్ రికార్డు సాధిస్తుంటారు. కానీ ఈ రష్యన్ మోడల్‌కి సహజ సిద్ధంగానే గిన్నిస్ రికార్డు సాధించే అవకాశం వచ్చింది. ఎకటెరినా లిసినాను ప్రపంచంలోనే అత్యంత పొడుగు కాళ్లున్న మహిళగా గిన్నిస్ ప్రతినిధులు ధ్రువీకరించారు. ఆమె పొడవు 6.87 అడుగులు కాగా.. కాళ్ల పొడవు 52 అంగుళాలు. 29 ఏళ్ల ఎకటెరినా రష్యాలో మోడల్‌గా, బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా అందరికీ సుపరిచితమే.
అంతేకాదు... 2008 ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్ క్రీడలో కాంస్య పతకం గెలిచిన రష్యా జట్టులో ఆమె కూడా ఉంది. ఆమెకు పుట్టుకతోనే కాళ్లు పొడవుగా ఉన్నాయని, ఇవాళ వాటి కారణంగానే గిన్నిస్ సాధించడం సంతోషంగా ఉందని లిసినా తండ్రి ఎకటెరినా అన్నాడు. తాను మోడలింగ్ రంగంలో రాణించడానికి ప్రధాన కారణం కూడా తన పొడుగు కాళ్లేనని లిసినా ఆనందం వ్యక్తం చేసింది.