: హరికృష్ణకు బుజ్జగింపు... రాజ్యసభకు పంపుతామని వర్తమానం?
టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవిని ఆశించిన సంగతి తెలిసిందే. అయితే, చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రవిశంకర్ ను ఈ పదవికి ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. చంద్రబాబు నిర్ణయంతో హరికృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారట. దీంతో, అయనను బుజ్జగించడానికి పార్టీ సీనియర్ నేతలను చంద్రబాబు రంగంలోకి దించారని తెలుస్తోంది. ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి నామినేట్ చేస్తామంటూ నాయకుల ద్వారా హరికృష్ణకు వర్తమానం పంపినట్టు సమాచారం.