: మహేష్ కత్తి దూకుడు వెనుక జగన్?.. రెక్కలు విచ్చుకున్న కొత్త పుకారు!


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న ప్రజాభిమానం అంతా ఇంతా కాదు. ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఒక సినీ నటుడిగానే కాకుండా... ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రభుత్వంలో కదలిక తెస్తూ, ఎంతో మంది అభిమానాన్ని ఆయన చూరగొంటున్నారు. అంతటి శక్తిమంతుడైన పవన్ పై... మొన్నటిదాకా ఎవరికీ తెలియని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఈ మధ్య కాలంలో విరుచుకుపడుతున్నాడు. మహేష్ కామెంట్ల నేపథ్యంలో పవన్ అభిమానులు ఐదారు వేల మంది వరకు ఆయనకు సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇచ్చారు. దీనికి పవన్ తనకు క్షమాపణ చెప్పాలని మహేష్ డిమాండ్ చేశాడు. బెంగళూరులో మహిళా జర్నలిస్టు హత్యకు సంబంధించి పవన్ చేసిన ట్వీట్ ను కూడా మహేష్ తప్పుబట్టాడు. కామన్ సెన్స్ లేకుండా ట్వీట్ చేశాడంటూ పవన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు.

ఈ నేపథ్యంలో, సరికొత్త పుకారు ప్రాణం పోసుకుంది. పవన్ స్థాయికి ఏ మాత్రం సరిపోని మహేష్ లాంటి వ్యక్తి ఆయనపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడం సాధ్యమయ్యే పని కాదని... మహేష్ వెనుక మరో శక్తి ఉందనే పుకారు ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ టీడీపీకి అనుకూలంగా ఉండటంతో... జనసేనను దెబ్బకొట్టడానికి, పవన్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి వైసీపీ అధినేత జగనే ఈ తతంగాన్ని నడిపిస్తున్నారంటూ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం ద్వారా, ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనేదే వైసీపీ వర్గీయుల ప్లాన్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ ఇంటర్వ్యూలో... 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా? అనే ప్రశ్నకు 'ఔను' అంటూ కత్తి మహేష్ ఇచ్చిన సమాధానం కూడా... ఈ పుకార్లకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో, వాస్తవం ఏమిటనేది భవిష్యత్తే తేల్చి చెప్పాలి!

  • Loading...

More Telugu News