: దాల్మియాపై స్మారకోపన్యాసం ఇవ్వమంటూ సంగక్కరకు గంగూలీ ఆహ్వానం!


భారత్ లో శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందు ఐసీసీ మాజీ చీఫ్, దివంగత జగ్ మోహన్ దాల్మియాపై స్మారకోపన్యాసం ఇవ్వాలని శ్రీలంక మాజీ దిగ్గజ కీపర్, బ్యాట్స్ మన్ కుమార సంగక్కరను టీమిండియా దిగ్గజ కెప్టెన్, క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆహ్వానించారు. నవంబర్ లో శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో స్మారకోపన్యాసం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు సంగక్కరకు ఫోన్ చేశానని తెలిపాడు. ఈ కార్యక్రమ నిర్వహణ తేదీ ఇంకా నిర్ణయించలేదని అన్నాడు.

గత ఏడాది న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటే బీసీసీఐ సర్వసభ్య సమావేశం కారణంగా రద్దైంది. అనంతరం ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా నిర్వహించాలనుకుంటే బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను సుప్రీంకోర్టు తొలగించడంతో రెండో సారి వాయిదా పడింది. దీంతో ఈ సారి ఎలాగైనా నిర్వహించాలని గంగూలీ భావిస్తున్నాడు. కాగా, తన వాణిజ్య విధానాలతో బీసీసీఐని అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డుగా తీర్చిదిద్దిన జగ్‌ మోహన్‌ దాల్మియా. 2015, సెప్టెంబర్‌ 20న మరణించారు. 

  • Loading...

More Telugu News