: ఆదిలాబాద్ లో కలకలం రేపిన విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం... పరిస్థితి విషమం!
ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. వసతి గృహంలో విద్యనభ్యసిస్తున్న గ్రామీణ బాలికలు శిరీష, సాయి నిధిలు హాస్టల్ లో బాత్రూంలు క్లీన్ చేసే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని చూసిన సహ విద్యార్థినులు సిబ్బందికి తెలపడంతో వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. సీనియర్ విద్యార్థినుల ర్యాగింగ్ వల్లే వారు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారు కోలుకునేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.