: నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి!: సింగర్ ని తిట్టి పోసిన కంగనా చెల్లెలు


బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌, ఆదిత్యా పంచోలి, శేఖర్ సుమన్, అతని కుమారుడు అధ్యాయన్ సుమన్ లపై ఆమె తీవ్ర ఆగ్రహంతో మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఆరోపణలు బాలీవుడ్‌ లో పెద్ద చర్చను లేవదీశాయి. ఈ క్రమంలో సింగర్ సోనా మహాపాత్ర కంగనా రనౌత్ కు బహిరంగ లేఖ రాసింది.

 ‘సిమ్రన్‌’ సినిమా ప్రచార కార్యక్రమాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావంతూ ఆ లేఖలో కంగనాపై సోనా మండిపడింది. ఇది సరికాదని సూచించింది. దీనిని కంగనా పట్టించుకోలేదు కానీ, ఆమె సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా సోనాపై ధ్వజమెత్తింది. ‘ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు దాన్ని సర్కస్‌ అంటూ వ్యాఖ్యానించకు. మనుషుల జీవితాలు వారి ప్రయాణాలు, సినిమాలపై ఆధారపడి ఉండవు. నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి. నీలాంటి వాళ్లు పబ్లిసిటీ కోసం ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారు’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో సానుకూల, ప్రతికూల స్పందనలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News