: 'బ్యాంకులో ఖాతా తెరవడం అన్నది వ్యయ ప్రయాసలే' అంటున్న ఆర్బీఐ!
సాధారణంగా ఏ బ్యాంకులోనైనా, ఎవరైనా ఖాతాను ఉచితంగా తెరవవచ్చు. బ్యాంకు నిబంధనల ప్రకారం అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉంటే సరిపోతుంది. ఖాతా తెరిచాక నగదు జమ మన ఇష్టం. ఇక జీరో బ్యాలెన్స్ ఖాతాలు కూడా ఉండనే ఉన్నాయి. అయితే అందరూ అనుకున్నట్టు ఈ ఖాతా ఉచితం కాదని, అందుకోసం ప్రతి ఒక్కరు రూ.139 ఖర్చుతో పాటు కొన్ని గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు తన నివేదికలో పాల్గొంది.
2016 బ్యాంకుల ఆడిట్‌ను పరిశీలించిన తర్వాత ఆర్బీఐ రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. బ్యాంకు డాక్యుమెంటేషన్ ఖర్చులతోపాటు ఖాతా తెరిచేందుకు బ్యాంకు చుట్టూ తిరిగేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులను కూడా ఇందులో కలిపింది. దీంతోపాటు సగటున ఒక్కొక్కరు 7:28 గంటలు ఇందుకోసం వెచ్చించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ఖర్చులు తగ్గాలంటే బ్యాంకుల్లో సాంకేతికతను పెంచడమే మార్గమని ఆర్బీఐ వివరించింది.