: విజయనగరంలో మహిళా టీచర్ హత్య కేసు.. కుటుంబ కలహాలే కారణం.. భర్త కూడా ఆత్మహత్య!


విజయనగరం జిల్లా ఎస్‌.కోట‌లో ఈ రోజు కొట్టాం జడ్పీ ఉన్నత పాఠశాల క్రాఫ్ట్‌ ఉపాధ్యాయురాలు ఉమాదేవి త‌న స‌హ‌చ‌ర ఉపాధ్యాయుడి బైక్ పై ఇంటికి వెళుతుండ‌గా ఆమె భర్త ఆమెను క‌త్తితో పొడిచి హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆమె భ‌ర్త కూడా ఘటనా స్థలికి కొద్ది దూరంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఉమాదేవిని ఆమె భ‌ర్త హ‌త్య చేయ‌డం వెనుక వారి మధ్య ఉన్న గొడవలే కారణమని భావిస్తున్నారు. వారిరువురూ గొడ‌వ‌ప‌డి ఇప్ప‌టికే ప‌లుసార్లు పోలీసుల‌ను కూడా ఆశ్ర‌యించారు. ఈ దంప‌తుల‌కి ఇద్దరు పిల్లలున్నారు. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.  

  • Loading...

More Telugu News