: సోదరిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన హృతిక్ రోషన్!


తన సోదరి సునయన బరువు తగ్గడం (వెయిట్ లాస్)పై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా సునయన లావుగా ఉన్నప్పుడు, బరువు తగ్గిన తర్వాత ఫొటోలను జతపరిచి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘దీనినే నేను మార్పూ అంటాను!! దీదీ.. నాకు చాలా చాలా గర్వంగా ఉంది.. కీప్ గోయింగ్.. ఏదీ అసాధ్యం కాదు’ అని ఆ ట్వీట్ లో హృతిక్ పేర్కొన్నాడు. కాగా, మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ‘సూపర్ 30’ చిత్రంలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News