: నా ఇండియా ఎంతో దయతో ఉండాలి: ఏఆర్ రెహ‌మాన్‌


సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య సంఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరాడు. ఈ ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటే, ఇది నా ఇండియా కాదనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు ఇండియాలో జరగకూడదు. నా ఇండియా ఎంతో దయతో ఉండాలి’ అని రెహమాన్ భావోద్వేగంగా అన్నారు.

‘మీపై ‘బయోపిక్’ వచ్చే అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా, ‘నేను ఇప్పటికీ వయసులోనే ఉన్నా. నేను చనిపోయిన తర్వాత నాపై ఎవరైనా ‘బయోపిక్’ తీస్తారేమో!’ అని అన్నారు. కాగా, ఉత్తర అమెరికాలోని 14 నగరాల్లో రెహమాన్ కాన్సర్ట్స్ నిర్వహించారు. వీటన్నింటి సమాహారాన్ని ‘వన్ హార్ట్: ద ఏ ఆర్ రెహమాన్ కాన్సర్ట్ మూవీ’ పేరిట ఓ సినిమాగా రూపొందించారు.ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో ముంబైలో నిన్న నిర్వహించారు. ఈ షో లో పాల్గొన్న రెహమాన్ పైవ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News