: కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల


కాకినాడ నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 12 లోగా ఆయా డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులందరికీ నోటీసులు ఇవ్వాలని, వారిని సమావేశపరచి మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకోవాలని, 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది. కాగా, ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 48 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి 35 స్థానాలు, వైసీపీ 10 స్థానాలు, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.

  • Loading...

More Telugu News