: కొలీగ్ బైక్ పై వచ్చిన భార్య.. ఆగ్రహంతో భార్యను నరికి చంపిన భర్త!
విజయ నగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాం సమీపంలో ఓ ఉపాధ్యాయురాలు తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ రోజు సాయంత్రం తన సహచర ఉపాధ్యాయుడి బైక్‌పై ఆమె తన ఇంటి వైపునకు వెళ్లింది. అయితే, ఆమె ఇతర వ్యక్తితో వస్తుండగా చూసి ఆగ్రహం తెచ్చుకున్న ఆమె భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను చంపేశాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ టీచర్ పేరు ఉమాదేవి అని, ఆమె కొట్టాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తోందని చెప్పారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.