: గతంలో పనిచేసిన 16 మంది సీఎంల కుమారులలో ఎవరూ 'సీఎం' కాలేదనే భయంతో.. కొత్త సచివాలయం కడతారా?: రేవంత్ రెడ్డి ఫైర్


ఇప్పుడున్న సచివాలయాన్ని వదిలేసి, కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయించడం ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉన్న తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్న ఏకైక కారణంతోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని విమర్శించారు. గతంలో 16 మంది ముఖ్యమంత్రులుగా పని చేశారని... వారి కుమారులు ఎవరూ ముఖ్యమంత్రులు కాలేదనే భయంతోనే కొత్త సెక్రటేరియట్ ను కడతారా? అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ మూఢ నమ్మకమేనని అన్నారు.

  • Loading...

More Telugu News