: స్కూల్ టాయిలెట్లో రెండో తరగతి విద్యార్థి హత్య!
ఏడేళ్ల బాలుడు తాను చదువుకుంటోన్న పాఠశాలలోనే హత్యకు గురైన ఘటన దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ లో కలకలం రేపింది. తమ పాఠశాలలోని రెండో తరగతి విద్యార్థి బాత్రూమ్ లో రక్తపు మరకలతో పడి ఉండడాన్ని గుర్తించిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పోలీసులకి సమాచారం అందించింది. ఆ విద్యార్థిని దుండగులు గొంతుకోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాలుడి మృతదేహం పక్కన కత్తి కూడా లభ్యమైందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ఆ పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.