: చిక్కుల్లో పడ్డ ఇజ్రాయెల్ ప్రధాని భార్య


ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీమణి సారా నెతన్యాహు చిక్కుల్లో పడ్డారు. ప్రజా నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఆమెను వెంటాడుతున్నాయి. ప్రధాని అధికార నివాసం కోసం కేటాయించిన నిధులను సారా అక్రమంగా వాడుకున్నట్టు ఆరోపణలున్నాయి. సుమారు రూ. 38 లక్షల మేర అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అంటున్నారు. ఇప్పటికే ఆమె లై డిటెక్టర్ పరీక్ష, పాలీగ్రాఫ్ పరీక్షలకు హాజరయ్యారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు. దీనిపై బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, తన భార్య ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.

  • Loading...

More Telugu News