: ఇలాగే చేసి మనల్ని చెడగొట్టేస్తారు బాబాయ్.. మనకి ఇవి వద్దు: రానాతో హీరో నాని


‘తుది ఫ‌లితాలు వ‌చ్చేశాయి.. ‘యువ‌ సినీన‌టులు నాని, రానా, వ‌రుణ్ తేజ్, విజ‌య్ దేవ‌రకొండ’ ఈ న‌లుగురిలో ఎవ‌రు పెద్ద స్టారో తెలిసిపోయింది.. స‌ర్వేలో నానిదే అగ్ర‌స్థానం’ అంటూ ఒక‌రు చేసిన ట్వీట్‌ను రానా ద‌గ్గుబాటి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో హైలైట్ చేసి చూపించాడు. అయితే, దీనిపై స్పందించిన హీరో నాని ‘ఇలాగే పోల్స్ పెట్టి చెడగొట్టేస్తారు బాబాయ్‌.. ఇవి మ‌న‌కి వ‌ద్దు.. మంచి సిన‌మాలు చేసుకుంటూ పోదాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటువంటి స‌ర్వేల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని పిలుపునిచ్చాడు. ఈ న‌లుగురు యువ హీరోలు తాజాగా టాలీవుడ్‌లో మంచి హిట్స్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీరిలో ఎవ‌రు గ్రేట్? అనే విష‌యంపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  

  • Loading...

More Telugu News