: వెన్నెల కిశోర్.. నువ్వు లిప్ స్టిక్ పెట్టుకుంటావా?: సమంత
హాస్యనటుడు వెన్నెల కిశోర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. అందులో ఆయన కళ్లు పెద్దగా చేసి, కను బొమ్మలు పైకి లేపి, నోరు తెరచి కనిపిస్తున్నాడు. ఈ ఫొటో చెన్నై బ్యూటీ సమంతను బాగా ఆకట్టుకున్నట్లుంది. ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘వావ్.. నువ్వు చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు.. నీ కను బొమ్మలను నువ్వే తయారు చేసుకున్నావా?.. నీవు లిప్ స్టిక్ పెట్టుకుంటున్నావా?’ అని సమంత కామెంట్ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్ ఆమె అభిమానులను అలరిస్తోంది. సమంత చాలా అల్లరి పిల్ల అని కామెంట్లు పెడుతున్నారు.