: కత్తి మహేష్ పై మండిపడ్డ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించడం ద్వారా ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఒక్కసారిగా పాప్యులర్ అయిపోయాడు. ఇదే సమయంలో వవన్ అభిమానుల నుంచి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నిర్మాత బండ్ల గణేష్ లాంటి వారైతే ఏకంగా మాడిపోతావంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కత్తి మహేష్ పై మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే పవన్ పై చీప్ కామెంట్లు చేస్తున్నారని... అసలు తనకు కత్తి మహేష్ ఎవరో కూడా తెలియదని అన్నారు. వపన్ ఎలాంటి వ్యక్తో తెలిసిన వారెవరూ ఆయనపై చిన్న విమర్శ కూడా చేయలేదని తెలిపారు. మహేష్ లాంటి వ్యక్తులపై ఇంత చర్చ కూడా అనవసరమని అన్నారు.