: ఈ ట్వీట్ నేను చేయలేదంటూనే సంచలన ట్వీట్ చేసిన దిగ్విజయ్ సింగ్...మరోసారి పెను కలకలం
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో సంచలన ట్వీట్లు చేయడం.. అవి వివాదాస్పదం కావడం ఆ తరువాత కొన్నాళ్లు మౌనంగా ఉండడం, మళ్లీ ట్వీట్ చేయడం ఆయనకు అలవాటు. తాజాగా డిగ్గీరాజా చేసిన ట్వీట్ మరోసారి ట్విట్టర్ లో పెను కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన రెండు లైన్ల అసభ్య పదజాలంతో ఉన్న ఆ ట్వీట్ ను ఉదహరిస్తూ... ఇలాంటి రాతలకు విచారిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెను కలకలం రేపుతోంది.