: నాడు డయానా బిడ్డగా, నేడు బుల్లి యువరాజుకు తండ్రిగా... స్కూలుకెళ్లిన ప్రిన్స్ విలియం
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, తన కుమారుడు జార్జ్ ని తొలిరోజు స్కూలుకు తీసుకెళ్లిన సందర్భాన్ని, తాను తొలి రోజు స్కూలుకు వెళ్లిన రోజుతో పోల్చుతూ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్ అయింది. మూడున్నర దశాబ్దాల క్రితం తన తల్లి డయానా చెయ్యి పట్టుకుని స్కూలుకు తీసుకెళుతున్న ఫోటోను, దాని పక్కనే, స్వెట్టర్ ధరించి స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన తన కుమారుడు జార్జ్ ని నడిపించుకుంటూ వెళుతున్న ఫోటోను విలియం షేర్ చేశారు. తన తల్లి ప్రిన్సెస్ డయానా నాడు తనను పాఠశాలకు తీసుకెళ్లిందని, ఇప్పుడు తన కొడుకును తాను తీసుకెళుతున్నానని వ్యాఖ్యానించారు. కాగా, తొలి రోజు తోటి విద్యార్థులతో జార్జ్ సరదాగా గడిపినట్టు టీచర్లు తెలిపారు.