: యూఏఈ వెళ్లి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు!
యూఏఈలో భారతీయుడికి లక్ష్మీ కటాక్షం లభించింది. కేరళకు చెందిన మాథ్యూస్ అనే యువకుడు ఇటీవల ఉద్యోగ నిమిత్తం అబుదాబి వెళ్లాడు. అక్కడ 'సూపర్ 7 సిరీస్' లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. దాని ఫలితాలను నిన్న ప్రకటించగా, మాథ్యూస్ విజేతగా నిలిచాడు. ఈ మధ్యే ఉపాధి కోసం వెళ్లిన మాథ్యూస్ ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. ఈ లాటరీలో అతనికి 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. దీనిపట్ల మాథ్యూస్ హర్షం వ్యక్తం చేశాడు.