: ఆత్మహత్యకు సిద్ధమైన కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితుడు.. ఆదుకోవాలని ఆదేశించిన చంద్రబాబు


కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. ఆయనను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా... ఆయన వద్ద పురుగుల మందు డబ్బా కనిపించింది. ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేశవరెడ్డి విద్యా సంస్థల్లో రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టానని... ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నారంటూ కంటతడి పెట్టాడు. అయితే, చంద్రబాబు రాష్ట్ర పర్యటనలో ఉండటంతో... సీఎంను కలిసేందుకు వీలు కాలేదు. దీంతో, ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు... బాధితుడిని ఆదుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News