: కారులో వేధింపులతో తన భార్య వణికిపోయిందన్న ఢిల్లీ వాసి!


వేధింపులు తట్టుకోలేక తన భార్య ఉద్యోగానికి వెళ్లాలంటేనే భయపడుతోందని ఓ ఢిల్లీ వాసి పోలీసులను ఆశ్రయించాడు. గుర్గావ్ ప్రాంతంలో నివసిస్తూ, ఓ కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్న యువతితో కలసి స్టేషన్ కు వచ్చిన ఆమె భర్త వేధింపులపై ఫిర్యాదు ఇవ్వగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్న సదరు యువతి, రోజు మాదిరిగానే ఇటీవల ఆఫీసుకు తన కారులో బయలుదేరింది. కొంతదూరం వెళ్లిన తరువాత తన కారు వెనకే మరో కారు వస్తోందని ఆమె గమనించింది.

ఏదో చిరునామా అడిగేందుకు వారు వస్తున్నారని భావించింది. ఓ పది కిలోమీటర్ల తరువాత తన కారును దాటి ముందుకు వచ్చిన వారు, డోర్ తెరిచి అసభ్యంగా ప్రవర్తించారు. లైంగికంగా వేధించాలని చూశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆమె, భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఆయన పోలీసులకు ఫోన్ చేయాలని సలహా ఇచ్చాడు. ఆ వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో వారంతా నెమ్మదిగా జారుకున్నారు. ఆపై వణికిపోయిన తన భార్య, ఆఫీసుకు వెళ్లకుండా ఇంటికి వచ్చిందని, మరోసారి ఆఫీసుకు వెళ్లాలంటే భయపడుతోందని అతని భర్త ఫిర్యాదు చేయగా, ఐపీసీ 354 డీ, 354 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సెక్టార్ 51 మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News