: రోహింగ్యా ముస్లింలు ఐఎస్ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం.. వారిని తరిమేయండి: సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు


వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్ లో ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనవారని ఆమె అన్నారు. వీరందరినీ తిరిగి మయన్మార్ కు పంపించేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 40 వేల మంది రోహింగ్యాలు మన దేశంలో ప్రవేశించారని... వారిలో దాదాపు 15 వేల మంది జమ్ముకశ్మీర్ లో ఉన్నారని అన్నారు.

వీరి అక్రమ చొరబాట్ల వల్ల భారత్ లో ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం ఇవ్వడానికి ముస్లిం దేశాలు కూడా ముందుకు రావడం లేదని... అలాంటప్పుడు మనమెందుకు ఆశ్రయం ఇవ్వాలని ప్రశ్నించారు. వీరికి ఆశ్రయం ఇవ్వడానికి మన దేశమేమీ ధర్మశాల కాదని అన్నారు. మయన్మార్ లో మెజారిటీ ప్రజలైన బౌద్ధులు శాంతికాముకులని.... అలాంటివారిని రోహింగ్యాలు టార్గెట్ చేసి, హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారిని వెంటనే భారత్ నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News