: మెక్సికో తీరంలో కనీవినీ ఎరుగని భూకంపం...8.1 తీవ్రత


మెక్సికో తీరంలో కనీవినీ ఎరుగని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 దాటి నమోదైతే భారీ భూకంపంగా పేర్కొంటారు. గతంలో నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపం 7.2 తీవ్రతతో వచ్చింది. తాజాగా మెక్సికో తీరంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1 గా నమోదైంది. దీంతో తూర్పు మెక్సికో చిగురుటాకులా వణికింది. ఈ భూకంప ధాటికి సునామీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా దక్షిణ తీరం భారీ తుపానులతో అతలాకుతలం కాగా, గోరుపై రోకటి పోటులా తాజాగా భూకంపం వచ్చింది. 

  • Loading...

More Telugu News