: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేరా బాబా బంగారు సింహాసనం వీడియో చూడండి!


డేరా బాబా ముసుగులో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిన గుర్మీత్ రాం రహీం సింగ్ భారీ ఎత్తున ఆస్తులు పోగేసిన సంగతి తెలిసిందే. తానే స్వయంగా పండించానని, వాటిని తింటే అనారోగ్యం దరిచేరదని చెబుతూ ఒక వంకాయ వెయ్యి రూపాయలు, టమాటా వెయ్యి రూపాయలు, బొప్పాయి పండు ఐదు వేల రూపాయలు, అరకిలో బీన్స్ లక్ష రూపాయలు.. ఇలా భారీ ఎత్తున రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా అతని ఆశ్రమంలో తనిఖీల నిమిత్తం అడుగుపెట్టిన భద్రతా బలగాలు అతని వైభవం చూసి ఆశ్చర్యపోతున్నాయి. బంగారు సింహాసనాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే గేబుల్స్, బంగారు అంచులతో తయారైన భోజన సామగ్రి, బంగారు పూతతో సీలింగ్...అత్యంత ఖరీదైన డోర్, వాల్ కర్టెన్స్...వీటికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News