: ఆ ఆలోచన వస్తే రాజీనామా చేసి, ఇంట్లో కూర్చునేవాడిని: గోవా ముఖ్యమంత్రి పారికర్


తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదని... తన కుటుంబానికి ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చానని... అయితే, 10 ఏళ్లకు రాజకీయాల నుంచి బయటకు వస్తానని భావించానని చెప్పారు. ఇన్నేళ్లలో తాను రాజకీయాలకు పనికిరానని ఏ క్షణంలోనైనా అనిపించి ఉంటే, ఆ క్షణంలోనే రాజీనామా చేసుండేవాడినని తెలిపారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న తాను... ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే తాను కేంద్ర మంత్రి పదవిని చేపట్టానని... అయితే, గోవా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా తిరిగొచ్చానని తెలిపారు. ఇకపై పూర్తికాలం సీఎంగా కొనసాగుతానని చెప్పారు. ఓ కార్యక్రమంలో పారికర్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News