: గుర్మీత్ డేరాలో భారీ ఎత్తున దొరికిన గర్భనిరోధక మాత్రలు, కండోమ్ లు
సిర్సాలోని డేరా బాబా ముసుగులో గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చేస్తున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఆస్థి పంజరాలు వెలుగు చూడగా, ఆయన రహస్య గదుల్లోకి వెళ్లిన భద్రతాధికారులకు షాకింగ్ వస్తువులు లభించాయి. అత్యాచారం కేసు విచారణలో ఒక దశలో తాను నపుంసకుడినని, వారిపై లైంగిక దాడి ఎలా చేస్తానని ప్రశ్నించిన గుర్మీత్ సింగ్ కు చెందిన రహస్య బెడ్ రూంలలో భారీ ఎత్తున గర్భనిరోధక మాత్రలు, కండోమ్ లు లభించాయని తెలుస్తోంది. కాగా, ఈ రహస్య గదుల నుంచి యువతుల డేరాల్లోకి సొరంగమార్గాలు ఉన్నాయని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో డేరా బాబా ముసుగులో రాం రహీం సింగ్ యువతులను సెక్స్ బానిసలుగా మార్చేవాడని వారు అంచనా వేస్తున్నారు.